బెల్లంపల్లి, వెలుగు: తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, సీఐ దేవయ్య వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బి.నీలేశ్, దూల రాజేశం, మీసాల భిక్షపతి, దూల నవీన్, ఈగం రాజేశం, రెబ్బెన శ్రీకాంత్ గ్రూపుగా ఏర్పడ్డారు.
తాండూర్, భీమిని, బెల్లంపల్లి, నెన్నెల్, తాళ్లగురిజాల, తిర్యాని, రెబ్బెన పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్లు టి.రాజేశ్వర్, ఎం.రాము , వి.తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు ఎం.విజయ్ కుమార్, బి.తిరుపతిని ఏసీపీ అభినందించి క్యాష్ రివార్డ్ అందజేశారు.
