Aadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా

Aadivaram Movie: సరికొత్త కథతో ‘ఆదివారం’.. ఘనంగా ప్రారంభమైన సినిమా

సరికొత్త కథ కథనాలతో  జెఎస్ రాజారెడ్డి నిర్మాణంలో సుబ్రమణ్యం చిగురుపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదివారం’. మంగళవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాకేత్ సినిమాటోగ్రఫీ, ఎస్ఎస్ వెంకటేష్ సంగీతం, దువ్వరపు వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.