న్యూఢిల్లీ: ఏఐ మానవజాతిని నాశనం చేస్తుందనే భయాలు అతిశయోక్తి అని జోహో కో–ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఏఐ అభివృద్ధి కొన్నాళ్లు ఆపాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. పెద్ద టెక్ కంపెనీలు తమ ప్రత్యర్థుల వేగాన్ని తగ్గించడానికే ఇటువంటి డిమాండ్లు తెస్తున్నాయని ఆరోపించారు.
మనదేశం పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. పెద్ద ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడానికి బదులు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లతో ఎంతో సాధించవచ్చని చెప్పారు.
