సంగీత దర్శకుడు కోటి 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసీ’ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. నవంబర్ 28న నిర్వహించబోతున్న ఈ కాన్సర్ట్ వివరాలను తెలియజేసేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈవెంట్ పోస్టర్‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. కోటి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను కంపోజ్ చేసిన ప్రతి పాటను ఆడియెన్స్ ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టారు. నా దగ్గర పని చేసిన రెహమాన్, దేవీ శ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండటం సంతోషంగా ఉంది.
నవంబర్‌లో జరిగే ఈ కాన్సర్ట్‌లో అందరి హృదయాలకు దగ్గరైన పాటల్ని పాడతాం. కాన్సర్ట్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. మంజుల రావు జూపల్లి, మనతో ఎంటర్‌టైన్మెంట్స్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.
