గణేశుడికి వీడ్కోలు..ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల్లో ఘనంగా నిమజ్జనాలు

గణేశుడికి వీడ్కోలు..ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల్లో ఘనంగా నిమజ్జనాలు
  •     డప్పు చప్పుళ్లతో, యువత కేరింతలతో వేడుకలు 

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: నవరాత్రులు పూజలందుకున్న గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల్లో ఏర్పాటుచేసిన వేలాది గణేశుడి విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేశారు. చిన్నా పెద్దా తేడాలేకుండా తీన్మార్‌‌‌‌‌‌‌‌ స్టెప్పులు, డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 

గోదావరిఖనిలో  శోభాయాత్రకు భారీ వర్షం ఆటంకం కలిగించింది. గోదావరి నదిలో నీరు లేకపోవడంతో సాయంత్రం సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ నుంచి మూడు గేట్లను తెరిచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెట్టారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షంలోనే నిమజ్జనాలు కొనసాగాయి.