ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ హాస్పిటల్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్శంకర్డిమాండ్చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు గత ప్రభుత్వ హయాంలోనే కనీసం పూర్తిస్థాయిలో డాక్టర్లను నియమించలేదని విమర్శించారు.
రిమ్స్‌లో అదనంగా నిర్మించాల్సిన 150 బెడ్స్ ఆసుపత్రి, మెడికల్ కేర్, ఇతర అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయడానికి సుమారు రూ.150 కోట్లు అవసరమవుతాయని, ఈ వారంలోనే పూర్తి స్థాయి ఎస్టిమేట్లు సిద్ధం చేసి, అవసరమైన నిధులు మంజూరు చేయాలన్నారు. హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కారకులను శిక్షించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు హనుమాన్లు, గంటా జీవన్, కార్తీక్, నరేశ్, ఆత్రం సాయి, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
