కోస్గి, వెలుగు : నారాయణపేట జిల్లా కోస్గి మండలం గుండుమాల్ సమీపంలోని పెద్దగుట్టపై చిరుత సంచారించినట్లు బుధవారం ఉదయం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై అటవీశాఖ అధికారి లక్ష్మణ్‌ను వివరణ కోరగా పెద్దగుట్టపై చిరుత సంచారం వాస్తమేనని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు స్థానికులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
