- ట్రయల్ రన్ నిర్వహించిన ట్రాఫిక్, ఆర్టీసీ, రవాణా శాఖల ఆఫీసర్లు
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ కారిడార్కు వచ్చే రూట్లలో ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు. కేపీహెచ్‌బీ నుంచి సైబర్ టవర్స్ మీదుగా వేవ్‌రాక్ (జేఎన్టీయూ బయోడైవర్సిటీ కారిడార్) వరకు స్పెషల్ బస్ లేన్ ఏర్పాటుపై బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు.
ట్రాఫిక్, ఆర్టీసీ, రవాణా శాఖల అధికారులతో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ప్రీత్సింగ్ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ట్రాఫిక్, రోడ్డు సామర్థ్యం, పీక్అవర్స్లో బస్సులు వేగంగా వెళ్లడానికి వీలుగా కనీస స్టాపులతో బస్ లేన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్-–II శేషాద్రిణి రెడ్డి, ఆర్టీసీ ఈడీ శ్రీధర్, ఎస్‌సీఎస్‌సీ సీఈవో నవేద్ ఆలం ఖాన్తదితరులు పాల్గొన్నారు.
