కుత్బుల్లాపూర్, వెలుగు : బౌరంపేట్‌లో ఓ భక్తుడు వినాయకుడిపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించి తన భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన గణేశుని విగ్రహంపై స్థానికుడు సరుగారి ధర్మారెడ్డి బుధవారం హెలిక్యాప్టర్ద్వారా పూలు చల్లాడు.
2009 నుంచి ప్రతీ సంవత్సరం తాను ఇలా చేయాలని చూస్తున్నానని, వాతావరణంలో మార్పుల వల్ల సాధ్యం కాలేదన్నారు. ఈసారి తన కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు.
