పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు అరుదైన ఘనత దక్కింది. ఆయన కనుగొన్న ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్ కు యూరోపియన్ పేటెంట్ మంజూరు చేయాలని యూరోపియన్ పేటెంట్ కార్యాలయం (ఈపీఓ) నిర్ణయించడంతో, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్వచ్ఛ ఇంధన ఆవిష్కరణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించారు.
యూరోపియన్ పేటెంట్ దరఖాస్తు నెం. 17902782.6ను పరిశీలించిన అనంతరం ఈ పేటెంట్ మంజూరు చేసింది. ఈ ఆవిష్కరణకు యూరోపియన్ పేటెంట్ నెం. 3601699 కేటాయించింది.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు "నా ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు చేయాలని యూరోపియన్ పేటెంట్ కార్యాలయం నిర్ణయించడం నాకు సంతోషంగా ఉందని అన్నారు. సుస్థిర ఇంధన రంగంలో ఒక భారతీయ ఆవిష్కరణకు ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు" అని అన్నారు.
పైకప్పును బలంగా, వాతావరణ నిరోధకంగా, సౌందర్యవంతంగా ఉంచుతూనే, దానిని విద్యుత్తును ఉత్పత్తి చేసే ఆస్తిగా మార్చాలనేది మా ఆలోచన అని... ఈ యూరోపియన్ పేటెంట్ ఈ సాంకేతికతకు ప్రపంచవ్యాప్త రక్షణను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.
