హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్‎పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. 19 మందికి సీరియస్

హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్‎పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. 19 మందికి సీరియస్

హైదరాబాద్: దీపావళి పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ దగ్గర ముందు వెళుతున్న డీసీఎంను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్‎లో ప్రయాణిస్తోన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. దాదాపు 20 మందికి పైగా కూలీలు ముచ్చింతల్ దగ్గర ఓ భవనానికి పెయింటింగ్ వేసేందుకు మినీ వ్యాన్‎లో పనికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా శనివారం (నవంబర్ 7) అర్ధరాత్రి సమయంలో హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. ముందు వెళ్తోన్న డీఎంసీను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‏లోనే చనిపోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

మినీ వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ముందు వెళ్తోన్న డీఎంసీను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. దీంతో 20 కిలోమీటర్లు ఛేజ్ చేసి డీఎంసీను పట్టుకున్నారు ఔటర్ సిబ్బంది. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.