నాగచైతన్య నుంచి రాబోతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి హీరోయిన్. కార్తీక్ దండు దర్శకుడు. శనివారం ఈ చిత్రం నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పేరుతో ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. స్టైల్, అటిట్యూడ్, ఎనర్జీ కలగలసిన ఈ పాటలో నాగచైతన్యను కొత్తగా ఆవిష్కరించారు. అసాధారణమైన సాహస యాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్ హంటర్‌గా తనను ఈ పాటలో ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
ట్రెండీ బీట్స్‌తో బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేయడంతో పాటు పాడిన ఈ పాటకు అభినవకవి సాహిత్యం అందించారు. ‘ఐయామ్ బార్న్ టు రూల్’ అంటూ సాగిన ఈ పాటకు విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ అందించారు. బాపినీడు సమర్పణలో ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
