నాగార్జున, ఎన్టీఆర్ ప్రశంసలతో మరింత ఉత్సాహం వచ్చింది.. ‘ఇట్లు అర్జున’ నిర్మాత వెంకీ కుడుముల!

నాగార్జున, ఎన్టీఆర్ ప్రశంసలతో మరింత ఉత్సాహం వచ్చింది.. ‘ఇట్లు అర్జున’ నిర్మాత వెంకీ కుడుముల!

ఛలో, భీష్మ, రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హుడ్ లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న  వెంకీ కుడుముల.. వాట్ నెక్స్ట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాపించి నిర్మించిన మొదటి చిత్రం ‘ఇట్లు అర్జున’.  నాగార్జున సమర్పణలో  మహేష్ ఉప్పల ఈ చిత్రాన్ని రూపొందించాడు. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించారు. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకీ కుడుముల చెప్పిన విశేషాలు. 

‘‘కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే నిర్మాతగా మారాను.  మంచి కథతో నిర్మాణ రంగంలోకి రావాలనుకున్నా.  దర్శకుడు మహేష్ ఉప్పల చెప్పిన ‘ఇట్లు అర్జున’ కథ  బాగా నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాను. ఇదొక మంచి లవ్ స్టోరీ. ప్రేక్షకులకు కొత్త  అనుభూతిని అందిస్తుంది.   అనీష్  నాకు ఎప్పటినుంచో పరిచయం. ఈ కథలో మూగవాడి పాత్రకు కొత్త హీరో అయితే బాగుంటుందని తనను ఎంపిక చేశాం. అనీష్ యాక్షన్ అద్భుతంగా చేశాడు. ఎక్కడా డూప్ ఉపయోగించకుండా తనే అన్ని యాక్షన్ సన్నివేశాలు చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.  

ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగార్జున గారు ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించడం, ఎన్టీఆర్ ట్రైలర్ చూసి ప్రశంసించడం  మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. తమన్ అందించిన బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు సినిమాకు హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  నిలుస్తుంది.   కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిర్మాణ రంగంలోకి వచ్చాను. కథ 100 శాతం నచ్చితే కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా.  ప్రస్తుతం నా డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఓ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ కథ సిద్ధం చేశాను’’.