గండిపేట, వెలుగు : బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూ ఈసారి రూ. కోటి లక్ష పలికింది. భక్తులు, అపార్ట్‌మెంట్ వాసులు ఉత్సాహంగా పాల్గొనగా చివరికి శక్తిమాన్ టీమ్ రూ.1.01 కోట్లకు లడ్డూను దక్కించుకుంది.
గతేడాది ఇక్కడ ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూ ఏకంగా రూ.2.31 కోట్ల ధర పలికింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు లేదా ఆలయ, గణేశ్ ఉత్సవాల నిర్వహణకు వినియోగించనున్నారు.
