Viral Video: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్లో శ్రీలీల సీరియస్.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన మహేష్

Viral Video: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్లో శ్రీలీల సీరియస్.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన మహేష్

డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మార్చి 19న విడుదల కానుంది. పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్న ఈ తరుణంలోనే 'శ్రీలీల-రంగస్థలం మహేష్' కి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. 

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో శ్రీలీల.. నటుడు రంగస్థలం మహేష్ వైపు సీరియస్‌గా చూస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా నెటిజన్లు ఇద్దరి మధ్య ఏదో వివాదం జరిగిందని రకరకాలుగా చర్చించుకున్నారు. కొంతమంది అయితే శ్రీలీల పట్ల మహేష్ ఏదైనా అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించాడా? అనే కోణంలో కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.

అయితే, శ్రీలీల చూసిన ఓర చూపులకు మహేష్ మొదట నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. అయినప్పటికీ, శ్రీలీల కోపాన్ని చూసి వెంటనే మౌనంగా ఉండిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ మాటల యుద్ధం జరగకపోయినా, శ్రీలీల బాడీ లాంగ్వేజ్ చూస్తే.. ఆమె ఏదో విషయంలో తీవ్ర అసహనానికి లోనై ఉంటుందని కూడా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.

ఇలా ఎలాంటి స్పష్టత లేకుండా వైరల్ అవుతోన్న వీడియో క్లిప్పై తాజాగా క్లారిటీ వచ్చింది. నేరుగా నటుడు రంగస్థలం మహేషే.. అక్కడ స్వయంగా జరిగింది ఏంటనేది క్లారిటీ ఇచ్చారు. 

మహేష్ క్లారిటీ..

ఈ వైరల్ వీడియోపై స్పందించిన రంగస్థలం మహేష్ అసలు విషయాన్ని వివరించారు. “శ్రీలీల గారు ముందుగా నాకు ఫోన్ పట్టుకోమని ఇచ్చారు. తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ కోసం చూస్తున్నారని అనుకున్నాను. వెంటనే ఆమె స్క్రీన్ వైపు చూసారు. జరిగింది అంతే. దయచేసి ఎవరినీ అగౌరవపరచవద్దు” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఎండ్ కార్డ్ పడినట్లేనా?

మహేష్ ఇచ్చిన వివరణతో వీడియోపై స్పష్టత వచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు ఎంతవరకు తగ్గుతాయో చూడాలి. ప్రస్తుతం శ్రీలీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్పష్టమైన సమాచారం లేకుండా వైరల్ అయ్యే వీడియోలు ఎలా అపార్థాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.