రెండు రోజులు  ఫ్లైఓవర్లపై  బైక్లు నిషేధం.. మార్చి 16,17 తేదీల్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రెండు రోజులు  ఫ్లైఓవర్లపై  బైక్లు నిషేధం.. మార్చి 16,17 తేదీల్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బషీర్‌‌బాగ్, వెలుగు: షబ్- ఎ -ఖదర్(జాగ్నే కీ రాత్) పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. మార్చి 16, 17 తేదీల్లో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని ఫ్లైఓవర్లపై బైక్​లను అనుమతించబోమని హైదరాబాద్​ ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్​ ఒక ప్రకటనలో తెలిపారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్‌‌ప్రెస్ ఫ్లైఓవర్(జూ పార్క్ నుంచి ఆరామ్‌‌ఘర్ ఫ్లైఓవర్ వరకు), బహదూర్‌‌పురా ఫ్లైఓవర్(దేవిబాగ్ నుంచి జూ పార్క్ గేట్ నం.2 వరకు), చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్(నయారా పెట్రోల్ పంప్–హషమాబాద్ ప్రవేశ ద్వారం నుంచి ఫూల్‌‌బాగ్ డీఎల్​ఆర్​ఎల్​ వరకు), అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ (పిసల్‌‌బండ నుంచి లక్ష్మారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు) మార్గాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.