తగ్గుతూపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్.. మళ్లీ రూ.15వేల దిగువకు గ్రాము బంగారం

తగ్గుతూపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్.. మళ్లీ రూ.15వేల దిగువకు గ్రాము బంగారం

యుద్ధం ఇంకా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రగులుతూనే ఉన్న వేళ బంగారం, వెండి రేట్లు మాత్రం బేజారిపోతున్నాయి. రోజు కొద్దికొద్దిగా తగ్గుతున్న రేట్లతో భారతీయ కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వెండి కూడా స్థిరంగా లేదంటే కొద్దిగా తగ్గుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తమ నగరాల్లో నేటి తాజా రేట్లను పరిశీలించండి. 

మార్చి 16న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మార్చి 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.49 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 917గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 590గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 16, 2026న దేశవ్యాప్తంగా రూ.5వేలు తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 80వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.280 వద్ద ఉంది.