కొత్త ఏడాది 2026 జనవరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. వీటిలో జాతీయ పండుగలతో పాటు, ప్రాంతీయ పండుగలు కూడా ఉండటంతో కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో బ్యాంకులు మూసివుంటాయి. కాబట్టి, మీ బ్యాంక్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి - 1 గురువారం న్యూ ఇయర్, జనవరి - 2 శుక్రవారం మన్నం జయంతి, జనవరి- 3 శనివారం హజ్రత్ అలీ పుట్టినరోజు, జనవరి -12 సోమవారం స్వామి వివేకానంద జయంతి, జనవరి -14 బుధవారం భోగి, జనవరి -15 గురువారం సంక్రాంతి, జనవరి -16 శుక్రవారం కనుమ / తిరువళ్ళువర్ దినోత్సవం, జనవరి -17 శనివారం ఉఝవర్ తిరునాల్, జనవరి -23 శుక్రవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి- 26 సోమవారం గణతంత్ర దినోత్సవం కారణంగా దేశమంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మొత్తంగా చూస్తే వచ్చే నెలలో 4 ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతో పాటు వివిధ రాష్ట్రలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
►ALSO READ | స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్: నిబంధనలు చెప్పకుండా క్లెయిమ్ ఎగ్గొట్టడం చెల్లదన్న కోర్ట్..
ఈ పండుగ సెలవులతో పాటు.. అన్ని ఆదివారాలు, రెండవ ఇంకా నాలుగవ శనివారాల్లో బ్యాంకులు ఎప్పటిలాగే మూసి ఉంటాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ.. ATMలు, నెట్ బ్యాంకింగ్, UPI సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. అయితే కొన్ని సెలవులు కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే ఈ వరుస సెలవులు దృష్టిలో పెట్టుకొని ముందే ప్లాన్ చేసుకోండి.
