Oscars 2026: 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' కు 6 అవార్డులు.. బెస్ట్ యాక్టర్ మైకేల్ బి జోర్డాన్!

Oscars 2026: 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' కు 6 అవార్డులు.. బెస్ట్ యాక్టర్ మైకేల్ బి జోర్డాన్!

ఆస్కార్  అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగా ల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డు లను ప్రదానం చేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి అత్యధికంగా 6 పురస్కా రాలు వరించాయి. కార్యక్రమాన్ని ప్రముఖ హాస్యనటుడు కోసన్ ఓబ్రియన్ నిర్వహించా రు.

ఈ ఏడాది అవార్డుల్లో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' చిత్రం ప్రధానంగా నిలిచింది. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు మొత్తం ఆరు అవా ర్థులు గెలుచుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇందులో నటించిన షాన్ ఫైన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అం దుకున్నారు. మరోవైపు 'సిన్నర్స్' చిత్రం కూడా నాలుగు అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. 

ఈ చిత్రంలో నటించిన మైకేల్ బి జోర్టన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నా రు. ఇలా పలు విభాగాల్లో గెలిచిన చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు వరించడం విశేషం! బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా సెంటిమెంటల్ వాల్యూని ప్రకటించింది.