జ్యోతిష్యం: గురుడు.. శుక్రుడు కలిసి సంచారం..నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..!

జ్యోతిష్యం: గురుడు.. శుక్రుడు కలిసి సంచారం..నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..!

జ్యోతిష్యశాస్త్రంలో  గురుడు.. శుక్రుడు.. గురు గ్రహం, శుక్ర గ్రహం.. ఈ రెండూ కూడా ముఖ్యమైన గ్రహాలు. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది.  మార్చి 18న  గురువు, శుక్రుడు కలిసి దృష్టి యోగ కేంద్రాన్ని ఏర్పరుస్తారు.  దీని ప్రభావం వలన నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   ఈ గ్రహాల కలయిక వలన ఏర్పడిన శుభయోగం ప్రభావం 6 నెలలు ఉంటుంది.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . !

వృషభరాశి: గుడుడు.. శుక్రుడు రెండు పవర్​ ఫుల్​ గ్రహాలు కలయిక వలన ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు.  ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే  మంచి పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులకు  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. 
కొత్త ప్రాజెక్టు లేదా ఒప్పందాన్ని ప్లాన్ చేస్తుంటే  ఇదే సరైన సమయమని పండితులు చెబుతున్నారు. విదేశీ ప్రయాణం నుంచి మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.  విద్యార్థు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందుతారు. 

తులా రాశి: గురుడు.. శుక్రడు కలయిక ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైనది.  ఈ రాశికి అధిపతి శుక్రుడు. చేతి వృత్తుల వారికి అనుకోని లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్థి చేతికి రావడంతో  ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడటం ప్రారంభిస్తుంది.ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. దీంతో పాటు సామాజిక రంగాల్లో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను సాధిస్తారు.ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | మదిని వెంటాడే జ్ఞాపకాల కలనేత.. మర్చిపోవాలనే అనుకుంటున్నాను పుస్తకం

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి గురుడు అధిపతి కావడంతో.. గురుడు.. శుక్రుడు కలయిక ఈ రాశి వారికి  చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. . గతంలో నిలిచిపోయిన అనేక పనులు మళ్లీ ఊపందుకుంటాయి. గురుడు, శుక్రుడి కలయిక  ఏర్పడిన శుభయోగంతో  కెరీర్‌ విషయంలో లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశాలున్నాయి. . ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు మానసికంగా కూడా స్థిరంగా ఉంటారు. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే.. ఇది అనుకూలమైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మీన రాశి: గురుడు.. శుక్రుడు కలయిక ఈ రాశి వారికి  సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాల్లో మంచి మార్పు కనిపిస్తుంది.చాలా మందికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక అవకాశాలు ఉంటాయి.వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ ఇమేజ్‌ పెరుగుతుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.