రెప్పపాటులో ఆగిన గుండె : ఖమ్మం ఫంక్షన్ లో గుండెలు పిండేసే ఘటన

రెప్పపాటులో ఆగిన గుండె : ఖమ్మం ఫంక్షన్ లో గుండెలు పిండేసే ఘటన

ఏ నిమిషానికి ఏం జరుగునో అనేది పాత సామెత.. ఏ క్షణానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అనేది ఇప్పుడు నడుస్తున్న కాలం. రెప్పపాటులో ఆగిన గుండెతో.. గుండెలు పిండేసే ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరిగింది. అప్పటి వరకు అందరితో నవ్వుతూ మాట్లాడిన మహిళ.. చలాకీగా ఉన్న మహిళ.. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్న మహిళ.. వేదికపై విషెస్ చెబుతూ.. కళ్ల ముందే కుప్పకూలిపోయింది. రెప్పపాటులో గుండె ఆగి.. వేడుకను విషాధంలో నింపిన ఘటన అందర్నీ కలిచివేస్తుంది. ఖమ్మంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం  జిల్లా గాంధీ చౌక్ కి చెందిన  బొమ్మ సుష్మితా పుట్టకోట ప్రాంతంలో గృహ ప్రవేశానికి వెళ్లింది. అప్పటి వరకు అందర్ని నవ్వుతూ పలకరించిన ఆమె ఫోటో ఫోటో దిగుతున్న సమయంలో గుండె పోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ అనుకోని ఘటన విషాదాన్ని నింపింది.

ALSO READ : తెలంగాణలో ఈ వారం వర్షాలు..ఈ 17 జిల్లాల వాళ్లు అలర్ట్..

ఆమెకు ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుమారుడు ఉన్నాడు. గతంలో హర్ట్ కు సంబంధించిన వ్యాధి ఉండటంతో  ఫేస్‌ మేకర్ అనే  ఒక చిన్న బ్యాటరీతో పనిచేసే పరికరం అమర్చాలని డాక్టర్లు చెప్పారు. బీపీ కంట్రోల్ లో లేకపోవడంతో చికిత్సను వాయిదా వేశారు. మెడిసిన్స్ తో క్యూర్ అవుతుందని డాక్టర్లు చెప్పడంతో సుష్మితా మెడిసిన్ తో కాలం గడుపుతున్నారు. ఇంతలోనే ఫంక్షన్ కు వచ్చిన ఆమె  ప్రాణాలు కోల్పోయింది.