తెలంగాణలో ఈ వారం వర్షాలు..ఈ 17 జిల్లాల వాళ్లు అలర్ట్..

తెలంగాణలో ఈ వారం వర్షాలు..ఈ 17 జిల్లాల వాళ్లు అలర్ట్..

తెలంగాణకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ.  ఇవాళ్టి నుంచి( మార్చి 16)తో పాటు వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  మరాత్వాడ నుంచి  ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు  ద్రోణి కొనసాగుతుంది.  ఈ ప్రభావంతో  వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. మార్చి 16, 17న తెలంగాణలోని  ఉత్తర పశ్చిమ తూర్పు కొన్ని  జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.. 

ఏఏ జిల్లాల్లో అంటే..

మార్చి16 , 17న తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ,30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మార్చి 16 న 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదిలాబాద్,  కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ,రంగారెడ్డి ,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ ,సంగారెడ్డి ,మెదక్, కామారెడ్డి  జిల్లాలకు వర్ష సూచన చేసింది

మార్చి 17న అదిలాబాద్, కొమారం బీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ,నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్ ,హనుమకొండ, యాదాద్రి భువనగిరి ,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి ,వికారాబాద్, సంగారెడ్డి ,మెదక్, కామారెడ్డి,  మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

ALSO READ : లంచం ఇచ్చినా నా పని చేస్తలేరు..ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు

 రానున్న  నాలుగు, ఐదు రోజులు వర్షాలతో ఉష్నోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.   గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి  నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. 18, 19  తేదీల్లో  రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.   ఈదురు గాలుల తీవ్రత సైతం పెరిగి  40 నుంచి 50, అక్కడక్కడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో  వీచే  అవకాశం ఉంది.   వడగాండ్ల వర్షం సైతం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.