కామారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

కామారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: కామారెడ్డి, బడంగ్ పేట్  మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దీనిలో భాగంగా శానిటేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించిన ఫైళ్లు, బిల్లులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్న సమయంలో కొన్ని పనులు చేయకపోయినా చేసినట్లు చూపించి బిల్లులు పెట్టినట్లు ఆరోపణలపై తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ
గంగసాని శ్రీధర్ తెలిపారు.

 జీహెచ్ఎంసీలో విలీనం అయిన తరువాత కూడా నకిలీ బిల్లుల ద్వారా నిధులు పొందేందుకు ప్రయత్నాలు జరి గాయని ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్, శానిటేషన్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్లో లో విలీనం చేసే ముందు జరిగిన పనులకు సంబంధించి బిల్లులు సక్రమంగా ఉన్నాయా అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికా రులు తెలిపారు. ఇదిలా ఉండగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ సర్కిల్ కార్యాలయానికి అందుబాటులో లేరని, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని డిప్యూటీ కమి షనర్ సరస్వతి చేసిన కాలూ స్పందన రాలేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు.