సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, టీ20 వరల్డ్ కప్-2026 విన్నింగ్ టీమ్ మెంబర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. టీ20 ప్రపంచ కప్-2026 గెలుచుకుని హైదరాబాద్‏కు విచ్చేసిన సందర్భంగా సోమవారం (మార్చి 16) మర్యాదపూర్వకంగా సీఎంను కలిశాడు తిలక్ వర్మ. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించారు సీఎం రేవంత్. 

ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అంతముందు ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తిలక్ వర్మకు ఎయిర్ పోర్టులో అధికారులు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.