పైరసీతో రూ.20 వేల కోట్లు నష్టపోతున్నాం : కాంతార గర్జన

పైరసీతో రూ.20 వేల కోట్లు నష్టపోతున్నాం : కాంతార గర్జన

దక్షిణాది సినిమాలలో లో బడ్జెట్ సినిమాగా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సొంతం చేసుకున్న మూవీ కాంతార. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార 2 తెరకెక్కుతోంది. 2022లో విడుదలైన కాంతార మూవీతో రిషబ్ శెట్టి తెలుగు వాళ్లకు సుపరిచతం అయ్యారు. తన యాక్టింగ్ కు, డైరెక్షన్ కు అంత ఫిదా అయ్యారు.మరి ముఖ్యంగా రిషబ్ శెట్టి స్టోరీ రైటింగ్ కు ఖుదాస్ అన్నారు ఆడియన్స్. 

ఇప్పుడు లేటెస్ట్ గా రిషబ్ శెట్టి పైరసీకి వ్యతిరేకంగా అందరు నిలబడాలంటూ..అందుకు ప్రభుత్వ చొరవ కూడా అవసరమంటూ..చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పిచ్చి పట్టిన భూతంలా..సినీమా ఇండస్ట్రీని చీల్చేసే పైరసీని ఆపడానికి రిషబ్ తన గళాన్ని విప్పాడు.

రిషబ్ ట్విటర్‌ Xలో..కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) జారీ చేసిన అధికారిక ప్రకటనను పంచుకుంటూ..పైరసీ కారణంగా సినీ పరిశ్రమ ఏటా దాదాపు రూ.20,000 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంటున్నందున, సినిమా పైరసీని అరికట్టడానికి ప్రధాన చర్యలు తీసుకోవాలంటూ..పోస్ట్ లో తెలిపారు.

అలాగే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మరియు MIB అధికారులు..పైరసీని ఆపేయాలంటూ..సినిమా కంటెంట్‌ను మోసుకెళ్లే ఏదైనా వెబ్‌సైట్/యాప్/లింక్‌ను డైరెక్ట్‌గా బ్లాక్ చేయడం/తీసే అధికారం మీరు కలిగి ఉన్నారు.కనుక పైరసీ పై చర్యలు తీసుకోవాలంటూ తన ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు. రిషబ్ శెట్టి పైరసీ కి వ్యతికేరకంగా నిలబడటంతో..హర్షం వ్యక్తం చేస్తున్నారు.