హీరోయిన్ హన్సిక తన భర్త, వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియాతో విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల మార్చి 11న వీరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే, హన్సిక పెట్టిన ఫస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హన్సిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంజాబీ పదం ‘చార్దీ కలా..’ (Chardi Kala Always) అని క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ పెట్టింది. అంటే.. ‘‘ఎప్పుడూ ఉత్సాహంతో ముందుకుసాగాలని.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోవద్దని’’ దీని అర్థం. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట, కేవలం రెండేళ్ల లోపే విడిపోవడం సినీ ప్రేక్షలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4, 2022 హన్సిక, సోహెల్ ఖతూరియా వివాహం జరిగింది. జులై 2, 2024 నుంచి ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆంటే పెళ్లైన కొన్నాళ్లు మాత్రమే ఈ ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా ఎవరికి వారు విడిగా జీవిస్తున్నారు. అయితే, వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేయడం గమనార్హం.
