సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఫేక్ డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీసీటీవీ ఫుటేజీలో షాకింగ్ విషయాలు.. 

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఫేక్ డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీసీటీవీ ఫుటేజీలో షాకింగ్ విషయాలు.. 

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఓ ఫేక్ మహిళా డాక్టర్ పేషెంట్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరారైన ఘటన గురించి తెలిసిందే. బుధవారం ( మార్చి 12 ) జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజిలో సెక్యూరిటీ విషయంలో డొల్లతనం బయటపడింది. ఫేక్ మహిళా డాక్టర్ హాస్పిటల్ బయటి నుంచే యాఫ్రాన్, స్టెతస్కోప్ తో వస్తున్నా స్క్యూరిటీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు.

డాక్టర్ వేషంలో ఆసుపత్రిలోకి వచ్చిన సదరు మహిళను ఎక్కడా తనిఖీ చేయలేదు సెక్యూరిటీ సిబ్బంది. ఈ క్రమంలో మొదట నర్సింగ్ రూంలోకి వెళ్లి ఇంజక్షన్లు తీసుకున్న మహిళ ఆ తర్వాత పేషెంట్ రూంలోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. డ్యూటీలో ఉన్న నర్సులు కూడా సదరు ఫేక్ మహిళా డాక్టర్ ను గుర్తించకపోవడం ఇక్కడ మరో ట్విస్ట్ అని చెప్పాలి.

ఎవరూ గుర్తించకపోవడంతో దర్జాగా పేషెంట్ రూంలోకి వెళ్లిన ఫేక్ డాక్టర్ పేషెంట్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి నగలతో ఉదయించింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

ALSO READ : కనిపిస్తే పేల్చేసే పరిస్థితులు.. హార్మూజ్ జలసంధిని దాటి ముంబై పోర్టుకు చేరిన చమురు నౌక

ఈ ఘటనతో యశోద ఆసుపత్రిలో సెక్యూరిటీ డొల్లతనం బయటపడిందని అంటున్నారు నెటిజన్స్. పట్టపగలే ఫేక్ డాక్టర్ పేషెంట్ రూంలో వెళ్లి నగలు దొంగతనం చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉందంటే... ఇక పేషెంట్ల ప్రాణాలకు ఏం భద్రత ఉంటుందని అంటున్నారు నెటిజన్స్.