Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ సొంతం చేసుకోవడం కోసం అతడు ఈసారి ఐపీఎల్ 2026లో మరింత ధాటిగా ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా 2025లో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ని ఓడించి ఆర్సీబీ విజేతగా అవతరించింది.
విరాట్ కోహ్లీలో ఇంకా పరుగుల దాహం తీరలేదని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. నిజానికి అది గతంలో కంటే మరింత ఎక్కువగా ఇప్పుడు ఉందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా గత సీజన్లో విన్నర్ గా నిలిచిన తర్వాత అది మరింత పెరిగిపోయిందని పేర్కొన్నారు. కోహ్లీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకోవాలని అనుకుంటున్నాడు' అంటూ పఠాన్ అన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ప్రదర్శనల గురించి బాగుంది.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లతో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించాడని తెలిపాడు. ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ తనదైన ముద్ర వేయాలని కింగ్ అనుకుంటున్నాడు.. ఈ ఐపీఎల్ సీజన్లోనూ అతడు అదే దృక్పథంతో బరిలోకి దిగబోతున్నాడు.. ఈసారి బ్యాటింగ్ లో దుమ్మురేపి, మరోసారి ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందించే ఛాన్స్ ఉందని ఇర్ఫాన్ అన్నాడు.
కాగా మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. దీంతో మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు, ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు, దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ షెడ్యూల్ ని కేవలం 20 మ్యాచ్ లకి మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఎన్నికల తేదీలు ఖరారు అయిన తర్వాత ఫుల్ షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
