యానిమేషన్ ప్రపంచంలోకి అనిల్ రావిపూడి ఎంట్రీ.. ‘మహావతార్’ స్పూర్తితో భారీ ప్లాన్!

యానిమేషన్ ప్రపంచంలోకి అనిల్ రావిపూడి ఎంట్రీ.. ‘మహావతార్’ స్పూర్తితో భారీ ప్లాన్!

వరుస సినిమా హీట్ లతో ఫుల్ జోష్ లో ఉన్నారు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.  కమర్షియల్ ఎంటర్ టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన ఇప్పుడు తన రూటు మార్చారు. బాక్సాఫీస్ వద్ద నవ్వులు జల్లులు కురిపించే తన మార్క్ కామెడీకి కాస్త బ్రేక్ ఇచ్చి, సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నారు. గత ఏడాది యానిమేషన్ చిత్రం 'మహావతార్ '  సృష్టించిన రికార్డులు మేకర్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి సైతం ఒక భారీ యానిమేషన్స్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సరికొత్తగా ముందుకు...

అనిల్ రావిపూడి 'పటాస్' నుంచి 'మన శంకర వరప్రసాద్ గారు' వరకు వరుసగా తొమ్మిది హిట్ లతో దూసుకుపోతున్నారు. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న యానిమేషన్ జోనర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తోంది టాలీవుడ్ ఫుల్ టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కథా చర్చలు, క్యారెక్టర్ డిజైనింగ్ దశలో ఉంది. యానిమేషన్ చిత్రాలకు సమయం, టెక్నాలజీ చాలా ముఖ్యం. అందుకే ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు..

KVN ప్రొడక్షన్స్ భారీ ప్లాన్

KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం దక్షిణాదిలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దళపతి విజయ్ చివరి చిత్రం 'జననాయకన్', కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) వంటి భారీ చిత్రాలు ఈ బ్యానర్ లోనే రూపొందుతున్నాయి. అనిల్ రావిపూడితో చేయబోయే యానిమేషన్ మూవీ ఈ సంస్థకుమరో మైలురాయిగా నిలవనుంది. అయితే తన ట్రేడ్‌మార్క్ కామెడీని యానిమేషన్ రూపంలో ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వెంకీ - కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ కన్ఫర్మ్!

యానిమేషన్ వార్తలతో పాటు అనిల్ తన తదుపరి ప్రత్యక్ష సినిమా (Live Action) పై కూడా క్లారిటీ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్ ,నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతోంది. "వందకోట్ల బొమ్మను చూపించిన వెంకీ మామతో, మొదటి అవకాశం ఇచ్చిన కల్యాణ్ రామ్ అన్నతో కలిసి 2027 సంక్రాంతికి వస్తున్నాం" అంటూ అనిల్ రావిపూడి ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. ఒకవైపు ఈ భారీ మల్టీస్టారర్, మరోవైపు ప్రతిష్టాత్మక యానిమేషన్ మూవీతో అనిల్ రావిపూడి తన కెరీర్‌లో సరికొత్త 'యానిమేటెడ్' వెర్షన్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారు. మరి అనిల్ యానిమేషన్ ప్రపంచంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!