Allu Arjun: అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డికి పుష్ప స్పెషల్ థ్యాంక్స్..

Allu Arjun: అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డికి పుష్ప స్పెషల్ థ్యాంక్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద డాల్బీ థియేటర్ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు ఫ్యామిలీని ప్రశంసిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ రేంజ్ కేవలం పక్క రాష్ట్రాలకే పరిమితం కాకూడదని, హాలీవుడ్‌తో పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ ఎదుగుదలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.

‘అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు’ అల్లు అర్జున్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు పుష్ప రాజ్ (మార్చి 13న) తన X వేదికగా ట్వీట్ చేస్తూ రేవంత్ రెడ్డితో కలిసున్న ఫోటోను పంచుకున్నారు. వేడుకకు మద్దతు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు కూడా బన్నీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన సిబ్బంది, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ Dolby Cinemaలో అత్యాధునిక సాంకేతికతతో సినిమా చూడటం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ప్రేక్షకులంతా ఈ అద్భుత అనుభూతిని స్వయంగా ఆస్వాదించాలని బన్నీ ఆహ్వానించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.