IPL 2026: అన్ని టీమ్స్ ఈ రూల్స్ పాటించాల్సిందే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కఠిన ఆంక్షలు.. 

IPL 2026: అన్ని టీమ్స్ ఈ రూల్స్ పాటించాల్సిందే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కఠిన ఆంక్షలు.. 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో జరిగే 19వ ఎడిషన్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మెగా టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 10 ఫ్రాంచైజీలు అనుసరించాల్సిన కొన్ని కీలక సూచనలను జారీ చేసింది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఏ జట్టు కూడా ప్రత్యర్థి జట్టు ఉపయోగించిన అదే పిచ్‌పై ప్రాక్టీస్ చేయకూడదు, ఒకేసారి రెండు జట్లకు ప్రాక్టీస్ సెషన్‌లలు నిర్వహించొద్దు.. ప్రతి జట్టుకు కేటాయించిన ప్రాక్టీస్ సెషన్ కోసం కొత్త నెట్‌లు తప్పనిసరిగా అందించాలని బీసీసీఐ ఫ్రాంచైజీలకు సూచించింది. అన్ని ఫ్రాంచైజీ తన తొలి హోమ్ మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు నుంచి స్టేడియంలోని ప్రధాన పిచ్‌పై ప్రాక్టీస్ చేయకూడదని వెల్లడించింది. ఈ కాలంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యామ్నాయ మైదానాన్ని సంబంధిత రాష్ట్ర క్రికెట్ బోర్డు ఫ్రాంచైజీకి ఎలాంటి ఖర్చు లేకుండా అందించాలని తెలిపింది.

ఐపీఎల్ సీజన్ కోసం పిచ్‌ను సిద్ధం చేయడానికి, సంబంధిత ఫ్రాంచైజీ యొక్క తొలి హోమ్ మ్యాచ్‌కు ముందు నాలుగు రోజులలో ప్రధాన పిచ్ పై ఎటువంటి ప్రాక్టీస్ సెషన్‌లు లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగకూడదు అని బీసీసీఐ పేర్కొనింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఫ్రాంచైజీలకు సమయాన్ని సకాలంలో వినియోగించుకునేలా, పిచ్ పరిస్థితులను రక్షించడానికి రూపొందించబడ్డాయి.