అమెరికా, ఇజ్రాయెల్ కలిసి.. ఇరాన్ పై చేస్తున్న యుద్ధంలో విధ్వంసం అంతకంతకు పెరుగుతుంది. 2026, మార్చి 13వ తేదీన..ఇరాన్ దేశానికి చెందిన సామాజిక సంస్థ రెడ్ క్రీసెంట్ విధ్వంసానికి సంబంధించిన డేటా రిలీజ్ చేసింది.
మార్చి 12వ తేదీ నాటికి ఇరాన్ దేశ వ్యాప్తంగా బాంబు దాడులతో.. 24 వేల 531 భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది ఆ సంస్థ. ఇందులో 19 వేల 775 నివాస గృహాలు ఉన్నాయని.. మరో 4 వేల 511 కమర్షియల్, వ్యాపార భవనాలు ఉన్నాయని వివరించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 69 స్కూల్, కాలేజీ భవనాలు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇందులో 195 మంది టీచర్లు గాయపడినట్లు వెల్లడించింది క్రీసెంట్ సంస్థ.
ఇరాన్ దేశ వ్యాప్తంగా 16 రెడ్ క్రీసెంట్ భవనాలు బాంబు దాడులకు గురయ్యాయని.. 21 రెస్క్యూ వెహికల్స్, 19 అంబులెన్సులపైనా బాంబు దాడులు జరిగినట్లు వెల్లడించింది రెడ్ క్రీసెంట్ సంస్థ.
10 రోజుల్లోనే.. 25 వేల భవనాలు దెబ్బతినటంతో.. లక్షల మంది వరకు నిరాశ్రయులు అయ్యారని.. రాత్రికి రాత్రి వాళ్లు వీధుల్లోకి వచ్చారని.. యుద్ధం ఇంకా కొనసాగితే ఇంకా దుర్భర పరిస్థితులు వస్తాయని హెచ్చరించింది. ప్రజల ప్రాణాలు, వారి ఆసరాకు సంబంధించి.. మానవతా కోణంలో యుద్ధం ఆపాలని పిలుపునిచ్చింది ఇరాన్ రెడ్ క్రీసెంట్ సంస్థ.
