మొహర్రం సందర్బంగా విషపు క్యాప్సూల్స్ పంపిణీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహర్రం ఊరేగింపులోపాల్గొన్న వారిని సామూహిక హత్యకు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఎలుకల చంపే మందు అయిన జింక్ పాస్పైడ్ క్యాప్సూల్స్ పంపిణీ చేసి ఊరేగింపులో పాల్గొన్న వారిని చంపాలని పెద్ద కుట్ర చేశారు. కనీసం 15 వేల మందిని చంపాలనుకన్నాను అని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
నొప్పి నివారణ క్యాప్సూల్స్ జింక్ పాస్పైడ్ నింపిన క్యాప్సూల్స్ ను మొహర్రం ఊరేగింపులో పాల్గొన్నవారికి పంపిణీ చేశారు. అయితే అందులో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే క్యాప్సూల్స్ లో ప్రమాకరమైన ఎలుకలను చంపేందుకు వినియోగించే జింక్ పాస్పైడ్ ఉన్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి విచారించగా ఒకేసారి 15వేల మందిని చంపేందుకు భారీ కుట్ర పన్నినట్లు అంగీకరించాడు.
►ALSO READ | అత్యుత్సాహం.. క్షణాల్లో నీటిలోనే పోయిన ప్రాణం: రాంగ్ డైవ్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి మృతి!
నిందితుడు కుట్ర లో భాగంగా గత 15రోజులుగా ముంబైలో 50 కిలోల జింక్ ఫాస్పైడ్, 30వేల ఖాళీ క్యాప్సూల్ ను సేకరించి వాటిని నింపుతూ వచ్చాడు. మొహర్రం సందర్బంగా నొప్పి నివారణ మందులుగా వీటిని పంపిణీ చేయాలని స్కెచ్ వేశాడు. నిందితులు పంపిణీ చేసిన క్యాప్సూల్స్‌లో ఎలుకల సంహారిణిగా ఉపయోగించే జింక్ ఫాస్ఫైడ్ లభించిందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వేగంగా ఉన్నతాధికారులు స్పందించడంతో ఘోర విషాదాన్ని అడ్డుకోగలిగామని ముంబై పోలీసులు చెబుతున్నారు.
పెయింట్ వ్యాపారం నడుపుతున్న నిందితుడు తన వృత్తి ద్వారా కెమికల్స్ సేకరించి, ఆన్‌లైన్‌లో క్యాప్సూల్స్‌ను ఆర్డర్ చేశాడు. అతని విదేశీ ప్రయాణ సంబంధాలు, ముంబైలోని అతని సహచరులపైనా దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు.
