జూలై 1న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. టెన్త్ పాస్ అయితే చాలు..వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్!

జూలై 1న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. టెన్త్ పాస్ అయితే చాలు..వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్!

హైదరాబాద్‌లో  నిరుద్యోగ యువతకు  గుడ్ న్యూస్.  జూలై 1వ తేదీన నగరంలో ఒక భారీ మెగా జాబ్ మేళా జరగబోతోంది. కనీసం టెన్త్ క్లాస్ (SSC) పాస్ అయిన అభ్యర్థుల నుంచి ఆపై చదువులు చదివిన వారెవరైనా సరే... ఈ జాబ్ మేళాకు నేరుగా హాజరు కావచ్చు. ఐటీ (IT), హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్,  ఎడ్యుకేషన్ లాంటి మరెన్నో ప్రముఖ రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఫేర్‌లో పాల్గొంటున్నాయి. అంతేకాదు, కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఆప్షన్స్ కూడా ఇస్తున్నాయి.

వివరాలు

  •  జూలై 1, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు.
  •  కింగ్స్ ప్యాలెస్, మెహదీపట్నం (పిల్లర్ నంబర్ 67 దగ్గర, PVNR ఎక్స్‌ప్రెస్‌వే).
  •  ఈ జాబ్ మేళాకు ఎంట్రీ పూర్తిగా ఉచితం

ఇక్కడే మీకు నేరుగా స్పాట్ ఇంటర్వ్యూలు (Spot Interviews) జరిపి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం 83743 15052 నంబర్‌ను సంప్రదించవచ్చు.