భోపాల్: రాజా రఘువంశీ.. 2025 మేలో ఈ పేరు దేశవ్యాప్తంగా మోరుమోగింది. మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లిన భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ కిరాయి హంతకులతో కలిసి పథకం ప్రకారం హత్య చేయించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి మళ్లీ చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన కేతన్ అగర్వాల్ హత్య.
పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26)ను లోహగఢ్ కోటలో అతడికి కాబోయే భార్య సియా తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసింది. రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ హనీమూన్‌కు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి హత్య చేయగా.. సియా కేతన్‌ను కోటకు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి చంపేసింది.
ఈ రెండు కేసుల మోటివ్ ఒకటే. ప్రియుళ్ల కోసం భర్త, కాబోయే భర్తలను హత్య చేయడం. ఈ క్రమంలో కేతన్ హత్య కూడా తన కొడుకు మర్డర్ మాదిరిగా సిమిలర్‌గా ఉండటంతో తాజాగా ఈ అంశంపై రాజా రఘువంశీ తల్లి స్పందించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేసిన సియా గోయల్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
►ALSO READ | కన్నడలో చాట్‌జీపీటీతో ముచ్చట్లు.. బెంగళూరు ఆటో డ్రైవర్ స్టోరీ వైరల్
ఈ హత్యకు తన కోడలు సోనమ్ రఘువంశీ సియాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. సియా తన కోడలు సోనమ్‌కు మినీ వెర్షన్ అని అభివర్ణించారు. తన కొడుకు రఘువంశీ, కేతన్ అగర్వాల్ హత్యలతో పెళ్లి చేసుకోవాలంటే యువకులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను అదుపులో ఉంచడానికి సియా, సోనమ్‌లకు మరణశిక్ష విధించడం అవసరమన్నారు.
‘‘తన కోడలు సోనమ్ చేసిన పని సియాకు స్ఫూర్తినిచ్చింది. తన కుమారుడు రాజాను సోనమ్ తన ప్రియుడుతో కలిసి ఎలా హత్య చేసిందో సేమ్ సియా కూడా కేతన్‌ను అలాగే చంపేసింది. ఈ ఘటనలతో యువకులు పెళ్లి అంటే భయపడుతున్నారు. సోనమ్, సియా వంటి అమ్మాయిలను ఉరి తీయాలి’’ అని రఘువంశీ తల్లి డిమాండ్ చేశారు.
