Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా జరిగిన గ్రూప్-K చివరి లీగ్ మ్యాచ్‌లో కొలంబియా వర్సెస్ పోర్చుగల్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. మయామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకమైన నాకౌట్ (రౌండ్ 32) స్టేజ్‌కు అధికారికంగా అర్హత సాధించాయి.
హోరాహోరీ పోరు:
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆడాయి. పోర్చుగల్ జట్టు ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని మిడ్‌ఫీల్డ్‌ను నియంత్రించినప్పటికీ, కొలంబియా డిఫెన్స్ ని ఛేదించలేకపోయింది. పోర్చుగల్ స్టార్ ప్లేయర్ బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టిన పవర్‌ఫుల్ షాట్‌ను కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ అద్భుతంగా అడ్డుకున్నాడు. మరోవైపు, కొలంబియా ఫార్వర్డ్ ప్లేయర్ జాన్ కార్డోబా హెడర్ ద్వారా చేసిన గోల్ ప్రయత్నాన్ని పోర్చుగల్ గోల్‌కీపర్ డియాగో కోస్టా ఒంటిచేత్తో సేవ్ చేసి జట్టును ఆదుకున్నాడు.
స్టేడియంలో రొనాల్డో మెరుపులు:
తన కెరీర్‌లో 6వ ఫిఫా ప్రపంచ కప్ ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను కొలంబియా డిఫెండర్లు గట్టిగా అడ్డుకున్నారు. అయినప్పటికీ, రొనాల్డో మైదానంలో చూపించిన చురుకుదనం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మ్యాచ్ మధ్యలో రొనాల్డో చేసిన ఒక అద్భుతమైన 'బైసికిల్ కిక్' గోల్ ప్రయత్నం కొలంబియా డిఫెండర్‌కు తగిలి తృటిలో మిస్ అయింది.
కొలంబియా గోల్ క్యాన్సిల్:
మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్ల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా 90వ నిమిషంలో కొలంబియా డిఫెండర్ డేవిన్సన్ సాంచెజ్ హెడ్డర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి కొలంబియా క్యాంప్‌లో సంబరాలు నింపాడు. కానీ, అసిస్టెంట్ రెఫరీ దానిని 'ఆఫ్‌సైడ్' (Offside) గా ప్రకటించడంతో ఆ గోల్ కాస్తా రద్దయింది. దీంతో మ్యాచ్ 0–0తో ముగిసి, కొలంబియా ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక వరల్డ్ కప్ మ్యాచ్‌ను గోల్స్ లేకుండా (0-0) డ్రాగా ముగించింది.
గ్రూప్ K పాయింట్ల పట్టిక సమీకరణాలు
ఈ డ్రా ఫలితం కొలంబియా జట్టుకు ఎంతగానో కలిసివచ్చింది. 3 మ్యాచ్‌లలో 6 పాయింట్లతో కొలంబియా గ్రూప్-K లో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ 32 కు చేరింది. అలాగే, 3 మ్యాచ్‌లలో 4 పాయింట్లు సాధించిన పోర్చుగల్ రన్నరప్‌గా నాకౌట్ స్టేజ్‌లోకి అడుగు పెట్టింది.
— تغطيات كاس العالم (@wlv_k189) June 28, 2026
