హిందూ సంప్రదాయం.. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం, ఇంట్లో శంఖం ఉంచడం వల్ల సానుకూల శక్తి వెలువడుతుంది . శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు . ఇంట్లో శంఖాన్ని ఉంచి, ప్రతిరోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.శంఖం ప్రాముఖ్యత.. విశిష్టతతో పాటు పూజ గదిలో ఎలా ఉంచాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పూజ గదిలో శంఖాన్ని ఉంచితే చాల శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శంఖం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. దీని వలన శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.
హిందువులు ఇంటి పూజా గదిని.. పూజా మందిరాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పూజ గదిలో ఉంచే ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. దేవుడి పటాలు.. పసుపు.. కుంకుమ .. గంధం.. గంట.. ఇతర పూజా సామాగ్రిని చాలా పవిత్రంగా భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజా మందిరంలో శంఖం ఉంచితే చాలా మంచి జరుగుతుంది. పురాణాల ప్రకారం శంఖం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అంతేకాదు దీనిని శివాలయంలో కూడా ఉంచుతారు. జంగం వారు ఇంటికి భిక్షాటనకు వచ్చినప్పుడు కచ్చితంగా శంఖం ఊది.. పరమేశ్వరుడి ఆశీర్వదించేలా శంఖంతో శబ్దం చేస్తారు. విష్ణు మూర్తి చేతిలో శంఖాన్ని ధరించి ఉంటాడు.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం .. క్షీర సాగరాన్ని మథించే సమయంలో అనేక వస్తువులు వెలువడ్డాయి. అలా వచ్చిన వాటిలో శంఖం ఒకటి. లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి శంఖాన్ని స్వీకరిస్తాడు. అనేక ఆలయాల్లో నిత్య పూజల్లో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే దీనిని ఇంటి పూజా మందిరంలో ఉండాలి. పూజ సమయంలో శంఖాన్ని ఉపయోగించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏంటంటే.. శంఖాన్ని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
శంఖాన్ని ఎలా ఉంచాలి?
కేవలం శంఖం ఇంట్లో ఉంటేనే సరిపోదు, దానిని వాస్తు నియమాల ప్రకారం సరైన పద్ధతిలో ఉంచినప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి. పూజా గదిలో ఈశాన్యం (ఉత్తర-తూర్పు) దిశలో ఉంచాలి. శంఖం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడు, శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. అందులో పవిత్రమైన నీటిని నింపి ఉంచాలి . శంఖాన్ని ఎరుపు లేదా తెలుపు వస్త్రంపై ఉంచాలి. కనీసం వారానికి ఒకసారి వస్త్రాన్ని మార్యాలి. పూజ సమయంలో వాడే శంఖాన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం వేళల్లో ఊదడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని పండితులు చెబుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే పరమేశ్వరునికి శంఖం నీటితో అభిషేకం చేస్తారు. అలాంటి శంఖాన్ని ఎట్టి పరిస్థితిలో ఊదకూడదు. శంఖాన్ని శివలింగం లేదా శివుడి విగ్రహం ముందు ఉంచకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో దక్షిణావర్తి శంఖం (కుడి చేతి వైపు తెరుచుకునేది) ఉంచుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతారు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
