డీఆర్డీఓ హైఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్ఈఎంఆర్ఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 50.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్, కెమికల్ టెక్నాలజీ, ఏరోస్పేస్, ఏరోనాటికల్, కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/ బి.టెక్, బీఎస్సీ (కెమిస్ట్రీ), బీఏ, బి.కాం, బీఎల్ఐఎస్ (లైబ్రరీ సైన్స్), బీబీఏ పూర్తిచేసి ఉండాలి.
కనీస వయసు: 18 ఏళ్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 28.
సెలెక్షన్ ప్రాసెస్: అకాడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.inను సందర్శించండి.
►ALSO READ | DRDOలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూతోనే డైరెక్ట్ జాబ్.. పూర్తి వివరాలివే..
