62 ఏళ్ల వయసులోనూ డ్రగ్స్ రహిత సమాజం కోసం విజయలక్ష్మి సైకిల్ యాత్ర చేపట్టారు. ఏపీలోని భీమవరం నుంచి ఢిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో 14 జిల్లాల్లో పర్యటించిన ఆమెకు మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీసులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలనకు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే నెల 10న తన యాత్ర ఢిల్లీకి చేరుకుంటుందని తెలిపారు. (- రామాయంపేట/నిజాంపేట, వెలుగు)
