- తమిళనాడు ఎదురుచూస్తోందంటూ అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష లక్ష్యంగా ప్రత్యర్థుల వరుస వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదం తర్వాత.. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్ బీ ఉదయకుమార్.. నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి.
ఇటీవల తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయకుమార్ మాట్లాడుతూ.. ‘విజయ్ కి ప్రియమైన త్రిషకు ఎప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోంది’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు కర్నాటక నుంచి కావేరి నీటిని విడుదల చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమవడాన్ని విమర్శిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సినీ పరిశ్రమ నుంచి ఇటీవల జరిగిన నియామకాలను ఉద్దేశించి కూడా ఆయన ఈ విమర్శలు గుప్పించారు.
కాగా, ఉదయకుమార్ వ్యాఖ్యలపై నటి త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తూ మధురై అంతటా త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్లు అతికించారు. తమిళనాడులో సీఎం విజయ్ ని రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొద్దికాలంగా త్రిష పేరును ప్రత్యర్థులు తరచూ వాడుతున్న విషయం తెలిసిందే.
