కొండగట్టు ఆలయంలో రూ.56 లక్షలు స్వాహా చేసిన నలుగురిపై చర్యలు

కొండగట్టు ఆలయంలో రూ.56 లక్షలు స్వాహా చేసిన నలుగురిపై చర్యలు

కొండగట్టు ఆలయంలో గతంలో జరిగిన 55 లక్షల 50 వేల రూపాయల నిధుల దుర్వినియోగం కేసులో నలుగురిపై చర్యలు తీసుకున్నారు అధికారులు.  నిధుల దుర్వినియోగంలో కీలక పాత్ర పోషించి ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న ఆలయ సీనియర్ అసిస్టెంట్ జి. శ్రీనివాస చారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం వెనక పర్యవేక్షణ లోపం ఉందంటూ అప్పటి ఏఈవో బుద్ది శ్రీనివాస్(ప్రస్తుతం కొమురవెల్లి ఆలయ ఏఈవో)కు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు.  

అదేవిధంగా రికార్డులు సరిగ్గా నిర్వహించకుండా నిధుల దుర్వినియోగానికి కారణమయ్యారనే కారణంగా ప్రస్తుత కొండగట్టు సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తో పాటు, మాజీ సూపరింటెండెంట్  జి. శ్రీనివాస్ శర్మ (ప్రస్తుతం వేములవాడ ఆలయ సూపరింటెండ్) కు 2 ఇంక్రిమెంట్ల చొప్పున కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవుడి సొమ్ము కాజేసిన కేసులో ఇంకా విచారణ సాగుతోందన్న అధికారులు.