జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహమ్మద్ జవ్వాద్(27) యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఉపాధి కోసం మాల్టా వెళ్లిన జవ్వాద్ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో కారులో వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో జవ్వాద్ అక్కడికక్కడే చనిపోయాడు.
