గత వారం కొత్త సినిమాలు లేక థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ వీకెండ్ మాత్రం ఏ మాత్రం డిస్సప్పాయింట్ చేయకుండా క్రేజీ సినిమాలు దర్శనం ఇవ్వనున్నాయి. హిస్టారికల్ మైథాలజీగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘నాగబంధం’, మహేష్ బాబు నిర్మాతగా సత్యదేవ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహద్దూర్’ మరోవైపు హిందీ తెలుగు డబ్బింగ్ మూవీ ‘ఆల్ఫా’. ఇలా ఈ మూడు సినిమాలు థియేటర్స్ లలో రచ్చ చేయనున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓటీటీ సినిమాలు కూడా ప్రేక్షకులకు వినోదపు విందు అందించనున్నాయి. గతవారం జూన్ 22 నుంచి 28 మధ్య ఏకంగా 18 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక ఈ వారం కూడా కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా, కామెడీ వరకు అన్ని జోనర్లలో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్
ఎనోలా హోమ్స్ 3- జూలై 1
పెద్ది (తెలుగు స్పోర్ట్స్ డ్రామా)- జూలై 2
సూపర్ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్)- జూలై 2
హ్యూమన్ వేపర్ (జపనీస్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్)- జూలై 2
స్పార్క్స్ ఆఫ్ టుమారో- జూలై 5
సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ సీజన్ 3- జూలై 2
ప్రైమ్ వీడియో
అబ్సెషన్ -హారర్ థ్రిల్లర్- జూన్ 29
ఎల్లె- టీవీ సిరీస్- 'లీగల్లీ బ్లోండ్' సినిమాకు ప్రీక్వెల్- జూలై 1
ఇసాకాపట్నం - జూలై 2, 2026
మ్యాగిలుమియర్ మ్యాజికల్ గర్ల్స్ ఇంక్- జూలై 5
జియోహాట్‌స్టార్
ఎక్స్-మెన్ '97 సీజన్ 2- జూన్ 30
ప్రీతమ్ మరియు పెడ్రో- (ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్) జూలై 3, 2026
మోలీవుడ్ టైమ్స్- జూలై 3
తవ్వాయి- జూన్ 29.
ఆపిల్ టీవీ
సైలో సీజన్ 3 (సైన్స్ ఫిక్షన్ సిరీస్) - జూలై 3, 2026
సైన్స్ ఫిక్షన్ సిరీస్,
క్రంచీరోల్ ఓటీటీ
స్పార్క్స్ ఆఫ్ టుమారో (నెట్‌ఫ్లిక్స్ / జూలై 5, 2026)
