Chikitu: రజినీకాంత్‌‌‌‌ మాస్‌‌‌‌ డ్యాన్స్ వైరల్.. అనిరుధ్‌ స్పెషల్ ‌‌‌వైబ్‌‌‌‌తో చికిటు పాట

Chikitu: రజినీకాంత్‌‌‌‌ మాస్‌‌‌‌ డ్యాన్స్ వైరల్.. అనిరుధ్‌ స్పెషల్ ‌‌‌వైబ్‌‌‌‌తో చికిటు పాట

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి రాబోతున్న చిత్రం ‘కూలీ’ (COOLIE).లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున, ఆమిర్‌‌‌‌‌‌‌‌ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌‌‌‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌‌‌‌ను విడుదల చేశారు. ‘చికిటు’ (Chikitu) అంటూ సాగే ఈ  పాటను అనిరుధ్ కంపోజ్ చేయగా, అరివు లిరిక్స్ అందించాడు.

ఈ పాటలో రజినీకాంత్‌‌‌‌ చేసిన మాస్‌‌‌‌ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌ అభిమానులను హుషారెత్తిస్తున్నాయి. అనిరుధ్‌‌‌‌తో పాటు నటుడు, దర్శకనిర్మాత టి. రాజేందర్‌‌‌‌‌‌‌‌, లిరిసిస్ట్ అరివు కలిసి ఈ పాటను పాడారు. అంతేకాదు మ్యూజిక్ వీడియోలో రజినీకాంత్‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌ను అనుకరిస్తూ టి.రాజేందర్, అనిరుధ్‌‌‌‌ వేసిన స్టెప్స్ ఆకట్టుకున్నాయి.

రజినీకాంత్ సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే అనిరుధ్.. మరోసారి ఈ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో సినిమాపై మరింత హైప్‌‌‌‌ పెంచాడు. ఆగస్టు 14న పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా ఈ చిత్రం విడుదల కానుంది.  తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్‌‌‌‌ సునీల్ నారంగ్, సురేష్ బాబు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక హిందీలో ‘కూలీ’అనే టైటిల్‌‌‌‌ అందుబాటులో లేకపోవడంతో ‘మజ్దూర్‌‌‌‌‌‌‌‌’టైటిల్‌‌‌‌తో రిలీజ్‌‌‌‌ చేస్తున్నారు.