టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై టాలీవుడ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోవడం తెలుసు.. మరి ప్రమోషన్స్‌కు రావడం తెలీదా? అంటూ ఆయన మీడియా ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'పోలీస్ కంప్లైంట్'.
బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం ( జూన్ 10న ) హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కు మెయిన్ లీడ్ అయిన వరలక్ష్మి రాకపోవడంతో డైరెక్టర్ సంజీవ్ ఒక్కసారిగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫైర్ అయ్యారు.
ప్రమోషన్స్ కోసం అడుక్కున్నా..
షూటింగ్‌లో వరలక్ష్మికి గాయం అయినా మేము అడ్జస్ట్ అయ్యాం. ఆమె 'సరస్వతి' అనే మూవీ కోసం మూడు నెలలు డబ్బింగ్ చెప్పకుండా ఆపేశారు. షూటింగ్ బాగానే చేస్తారు కానీ, ప్రమోషన్స్ విషయానికి వస్తే మాత్రం అస్సలు రారు. ప్రెస్‌మీట్‌కు రమ్మని నేను ఆమెను అడుక్కున్నాను అంటూ సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పెద్దలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
అంత ఈగో ఎందుకు?.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంత పెద్ద హీరో అయి ఉండి కూడా తన సినిమా 'పెద్ది' కోసం ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతే కాదు 94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సినిమా 'సింగ్ గీతం' ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. వాళ్లంతా అంత గ్రేట్ అయితే.. మీకెందుకు అంత ఈగో అని వరలక్ష్మి శరత్‌కుమార్ ని సంజీవ్ ప్రశ్నించారు.
►ALSO READ | నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్.. 1970ల నాటి క్రైమ్ మిస్టరీ ‘రాఖ్’ ట్రైలర్ రిలీజ్!
రెమ్యునరేషన్ కోసం టంచన్‌గా ఫోన్.. కానీ..
కథానాయికగా సినిమాను భుజాన వేసుకోవాల్సిన ఆమే ప్రమోషన్స్‌ను ఎగ్గొట్టడం కరెక్ట్ కాదన్నారు. రెమ్యునరేషన్ బాకీల కోసం మాత్రం ఆమె మేనేజర్ రోజు టంచన్‌గా కాల్స్ చేస్తారు. కానీ ప్రమోషన్స్ కోసం మేము ఫోన్ చేస్తే అసలు స్పందించరు అని సంజీవ్ పేర్కొన్నారు.. చిన్న సినిమాలకు హీరో హీరోయిన్ల సపోర్ట్ చాలా ముఖ్యం. ఇప్పటికైనా ఆమె స్పందించి సినిమాను ప్రమోట్ చేయాలి అని డిమాండ్ చేశారు.
గతంలో నయనతార కూడా ఇలాగే ప్రమోషన్స్‌కు దూరంగా ఉండేవారు, కానీ ఆమె ముందే అగ్రిమెంట్‌లో ఆ విషయం క్లియర్ చేస్తుందని టాక్. మరి వరలక్ష్మి సైలెంట్‌గా ఉండటం వెనుక అసలు రీజన్ ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
