వాలెంటైన్స్ వీక్ 2026: ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు.. ఏ రోజు ఏ ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి!

వాలెంటైన్స్ వీక్ 2026: ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు.. ఏ రోజు ఏ ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి!

ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల రాగానే ప్రేమికుల్లో ఒక రకమైన ఉత్సాహం మొదలవుతుంది. కేవలం ఫిబ్రవరి 14న వచ్చే ప్రేమికుల రోజే కాకుండా, దానికి ముందు వచ్చే ఏడు రోజులు కూడా చాలా ప్రత్యేకం. 2026లో ఈ వారం ఏ రోజు ఏముందో చూద్దామా...

వాలెంటైన్ వీక్ 2026 క్యాలెండర్
ఈ వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 7న మొదలై 14న ముగుస్తుంది.

ఫిబ్రవరి 7 - రోజ్ డే (Rose Day): గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తపరిచే రోజు.

ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే (Propose Day): మనసులోని మాటను చెప్పే రోజు.

ఫిబ్రవరి 9 - చాక్లెట్ డే (Chocolate Day): తీపి చాక్లెట్లతో బంధాన్ని మరింత మధురంగా మార్చుకునే రోజు.

ఫిబ్రవరి 10 - టెడ్డీ డే (Teddy Day): క్యూట్ టెడ్డీ బేర్లను గిఫ్ట్ గా ఇచ్చే రోజు.

ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే (Promise Day): తోడుంటానని ఒకరికొకరు మాట ఇచ్చుకునే రోజు.

ఫిబ్రవరి 12 - హగ్ డే (Hug Day):  కౌగిలింతతో ప్రేమని పంచుకునే రోజు.

ఫిబ్రవరి 13 - కిస్ డే (Kiss Day): ముద్దుతో ప్రేమని చాటే రోజు.

ఫిబ్రవరి 14 - వాలెంటైన్స్ డే (Valentine's Day): ప్రేమ వారోత్సవాల ముగింపు ఇంకా వాలెంటైన్స్ డే విటన్నింటినీ కలిపి ఉంచుతుంది. 

ఏ రంగు గులాబీ దేనికి సంకేతం?
ఫిబ్రవరి 7న వచ్చే రోజ్ డేతో ఈ వారం మొదలవుతుంది. మాటలతో చెప్పలేని భావాలను పువ్వులతో చెప్పవచ్చు:
ఎరుపు: గాఢమైన ప్రేమకు గుర్తు.
పసుపు: స్నేహానికి గుర్తు.
పింక్ : కృతజ్ఞతకి గుర్తు.
తెలుపు: క్షమాపణకు సంకేతం.

ప్రస్తుతం కేవలం పువ్వులే కాకుండా.. గులాబీ వాసన వచ్చే పర్ఫ్యూమ్‌లు, కొవ్వొత్తులు లేదా నగలను కూడా గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు.

2026లో కొత్త ట్రెండ్స్
ఇప్పుడు జంటలు పాత పద్ధతుల కంటే భిన్నంగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. కేవలం వస్తువులే కాకుండా కలిసి ట్రిప్ వెళ్లడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నారు. ఫోటోలు ఉన్న ఫ్రేమ్‌లు, జ్ఞాపకాలతో కూడిన స్క్రాప్ బుక్స్ ఇస్తున్నారు. దూరంగా ఉండేవారు వీడియో కాల్స్, ఆన్‌లైన్ గిఫ్ట్స్ ద్వారా డిజిటల్ సప్రైజ్ చేస్తూ పలకరించుకుంటున్నారు. కేవలం ప్రేమికులే కాదు, స్నేహితులతో కలిసి లేదా సెల్ఫ్ లవ్ & ఫ్రెండ్ షిప్  సెలబ్రేట్ చేసుకునే ట్రెండ్ కూడా పెరిగింది.

►ALSO READ | Health Tips: వీటిని తాగితే అలసట రాదు.. పైగా ఆరోగ్యం కూడా..ఇంట్లోనే తయారు చేసుకోండిలా..!