ఎండలు పెరుగుతున్నాయి.. మధ్యాహ్నానికి శరీరం అలసటకుగురవుతుంది. ఆఫీసుల్లో పని ఒత్తిడి.. ఉక్కపోత .. అలసట చాలా ఇబ్బంది పెడతాయి. ఎంత పనిచేసినా అలసట రాకుండా.. ఇమ్యూనిటి పవర్ ను పెంచే జ్యూస్ లను టీ కి బదులుగా తీసుకొంటే ఆరోగ్యంతో పాటు అలసట కూడా తీరుతుంది. అలాంటి వాటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . !
ఆకుకూరలు, గుడ్లు, పాలు, చేపలు...చాలామందికి రెగ్యులర్ డైట్. అయితే, ఇలాంటి డైట్ బోర్ కొడితే...కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది.అయితే, రెస్టారెంట్లకువెళ్లే టైం ఉండదు. సో.. ఇంట్లో ఉండే కొన్ని ఫ్రూట్స్, వెజిటెబుల్స్ తో' ట్రైచేయొచ్చు
బీట్ రూట్జూస్ తయారీకి కావాల్సినవి
- బీట్ రూట్ : ఒకటి
- యాపిల్ :ఒకటి
- నిమ్మకాయ: ఒకటి
- కీరా :ఒకటి
- అల్లం: చిన్న ముక్క
- ఐస్ ముక్కలు : అర కప్పు
తయారీ విధానం: బీట్ రూట్ ముక్కలు, యాపిల్, కీదా ముక్కలు, అల్లం, నిమ్మకాయ తొక్క తీసి చిన్న ముక్కలు చేసి బెండర్లో మెత్తగా బ్లెండ్ చేయాలి చివరగా ఐస్ ముక్కలు, లెమన్ స్లైసెస్ సర్వ్ చేయాలి
క్యారెట్జూస్ తయారీకి కావాల్సినవి
- క్యారెట్లు: మూడు
- నిమ్మకాయ: ఒకటి
- అల్లం :చిన్న ముక్క
- పసుపు :అరటీస్పూన్
తయారీ విధానం: బైండర్ లో క్యారెట్ ముక్కలు, అల్లం ముక్క, పసుపు వేసి మెత్తగా బైండ్ చేసుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపు కోవచ్చు. చివరగా నిమ్మరసం కలిసితూ క్యారెట్ షాట్ రెడీ.
పైనాపిల్ జింజర్ షాట్ తయారీకి కావలసినవి
- పైనాపిల్ ముక్కలు: అర కప్పు
- అల్లం ముక్కలు : రెండు టీస్పూను
- యాపిల్ సిడర్ వెనిగర్: ఒక టేబుల్ స్పూన్
- ఉల్లికాడ ముక్కలు : రెండు టీస్పూన్లు
తయారీ విధానం: పైనాపిల్ ముక్కలు, అల్లం, ఉల్లికాడ ముక్కలు బ్లెండర్ వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. చివరగా నిమ్మరసం, యాపిల్ సిడర్ వెనిగర్ కలిపి సర్వ్ చేయాలి.
గ్రీన్ షాట్ తయారీకి కావలసినవి
- నిమ్మకాయ: ఒకటి
- పాలకూర: అర కప్పు
- పుదీన : రెండు టీస్పూన్లు
- కివీ ఫ్రూట్: ఒకటి
- లెమన్ గ్రాస్; రెండు టీ స్పూన్లు
తయారీ విధానం: పాలకూర, పుదీన, కివిఫ్రూట్, లెమన్ గ్రాస్ ను బైండర్ లో వేసి మెత్తగా బ్రెండ్ చేయాలి. అవసరమైతే నీళ్లు లేదా పాలు కలుపు కోవచ్చు. చివరగా నిమ్మరసంతో గార్నిష్ చేస్తే గ్రీన్ షాట్ రడీ.
వెల్నెస్ షాట్స్ తయారీకి కావలసినవి
- అరటిపండు :ఒకటి
- ఆల్మండ్ బటర్: ఒక టేబుల్ స్పూన్
- పాలకూర తరుగు: రెండు కప్పులు
- పుదీనా ఆకులు మూడు (టేస్ట్ కోసం)
- అల్లం తరుగు: రెండుటీస్పూన్లు
- పసుపు: అర టీ స్పూన్
- పెరుగు: మూడు టేబుల్ స్పూన్లు
- అవిసె గింజలు: ఒక టేబుల్ స్పూన్
- కోకొనట్ ఆయిల్ : ఒక టేబుల్ స్పూన్
- కొబ్బరిపాలు: ముప్పావు కప్పు
తయారీ విధానం: అరటిపండు ముక్కలతో పాటు అన్ని పదార్థాలను బ్లెండర్లో స్మూత్ గా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. స్వీట్ నెస్ కావాలనుకుంటే యాపిల్ సిరప్ లేదంటే ఎక్కువ అరటిపండు ముక్కలు వేసుకోవచ్చు. అవసరం అనిపిస్తే పావుకప్పు నీళ్లు కూడా కలుపుకోవచ్చు. చివరగా బాగా బ్లెండ్ అయిన స్మూతీని షార్ట్ గ్లాసెస్ లో సర్వ్ చేస్తే వెల్ నెస్ గ్రీన్ షాట్స్, రెడీ వీటిని రెండు గంటలు ఫ్రిజ్ లో ఉంచి కూల్‌గా కూడా తీసుకోవచ్చు...
వ్యాధి నిరోధక శక్తిని పెంచే కూరగాయలు, పసుపు, అల్లం లాంటి వాటితో తయారుచేసే ఈ జ్యూస్‌లను వెల్నెస్ షాట్స్, ఇమ్యూనిటీ పాట్స్, హెల్త్ పాట్స్ అంటారు. వీటిని ఎక్కువగా ఉల్లికాడలు, లెమన్ గ్రాస్, అల్లం, సి విటమిన్ , ఏ విటమిన్ ఉండే పండ్లతో తయారు చేయడం వల్ల ఫ్లూ, అలసట లాంటివి ఉండవు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
