
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ‘రిజానా - ఎ కేజ్‌డ్ బర్డ్’చిత్రంలో ఆమె.. ఆస్కార్ విజేత జెరెమీ ఐరన్స్‌కు జంటగా కనిపించబోతున్నారు. వెటరన్ డైరెక్టర్ చంద్రన్ రత్నం దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ భాగం శ్రీలంకలో చిత్రీకరించారు.
ఈ సినిమా గురించి వరలక్ష్మి మాట్లాడుతూ ‘జెరెమీ ఐరన్స్ వంటి గ్రేట్ యాక్టర్‌తో కలిసి పనిచేయడం డ్రీమ్ కమ్ ట్రూ అనిపిస్తోంది. ‘లయన్ కింగ్’సినిమాలో స్కార్ పాత్రకు ఆయన చెప్పిన డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఆ సినిమాను చూశా. ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.
అలాగే శ్రీలంకతో పాటు ప్రపంచ సినిమాకు కొత్తదారులు చూపిన చంద్రన్ రత్నం డైరెక్షన్‌లో ఇంటర్నేషనల్ స్టార్స్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది’ అని చెప్పారు.
#VaralaxmiSarathkumar, is set to make her Hollywood debut in the international film '#RizanaAcagedBird.'
— MOHIT_R.C (@Mohit_RC_91) June 25, 2025
The film 'Rizana – A Caged Bird' is based on the true story of Rizana Nafeeq, a young Sri Lankan domestic worker who was executed in Saudi Arabia in 2013. pic.twitter.com/b20eItXWwx