వరుణ్ తేజ్-లావణ్య వెడ్డింగ్ కార్డు చూశారా!

వరుణ్ తేజ్-లావణ్య వెడ్డింగ్ కార్డు చూశారా!

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో జూన్ 9 న హైదరాబాద్‌లో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. మెగా సోదరుడు నాగ బాబు(Nagababu) ఇంట్లో ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది.

వరుణ్,లావణ్యల వివాహం నవంబర్ 1న ఇటలీ-టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌(Borgo San Felice Resort)లో చేసుకోనున్నారు. ఇది ఒక చారిత్రాత్మక గ్రామంగా పేరొంది. ఆ తర్వాత రిసార్ట్‌గా మారింది. ఈ గ్రామంలో సినీ సెల‌బ్రిటీల పెళ్లిల్లు జరగడంతో ఈ ప్లేస్ హాట్ టాపిక్ గా మారింది.

లేటెస్ట్ గా వీరి మ్యారేజ్ వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ విషయానికి వస్తే..గోల్డ్, సిల్వర్ థీమ్ లో కార్డు అట్ట్రాక్ట్ చేస్తోంది. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాలను కార్డు పైభాగంలో ఉన్నాయి.

వెడ్డింగ్ కార్డు లోపల వరుణ్ తేజ్ నానమ్మ తాతయ్య పేర్లు అయిన అంజనాదేవి, దివంగత కొణిదెల వెంకట్రావు పేర్లను ముద్రించారు. అలాగే వారి పేర్ల కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లతో ఉండగా..అందరి బ్లెస్సింగ్స్ తో పెళ్లి చేసుకుంటున్నట్టు ఈ కార్డులో పేర్కొన్నారు. ఈ వెడ్డింగ్ కార్డును  మెగా ఫ్యామిలీ ఆఫీసియల్ పోస్ట్ చేయలేదు, కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది.

వరుణ్ తేజ్..లావణ్య వివాహ వేడుకలు వరుసగా..హల్దీ, మెహందీ, సంగీత్ తో స్టార్ట్ అయి..నాలుగు రోజుల‌ పాటు ఈవెంట్ కళకళలాడబోతుంది. ఆ తర్వాత నవంబర్ 1న వివాహంతో పూర్త‌వుతుంది. అనంత‌రం గ్రాండ్ పార్టీ ఉంటుందని సమాచారం.

ALSO READ :- అతడి పనితనానికి ఇంప్రెస్​ అయిన దీపికా.. ఆ న్యూస్ వైరల్!

ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కామినేని, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆయ‌న కుటుంబం, అల్లు అర్జున్, అల్లు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మరి కొంతమంది ప్రముఖులు హాజరుకానున్నారు.