పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా.. ఫ్యామిలీ స్టార్ మాములుగా లేడుగా

పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా.. ఫ్యామిలీ స్టార్ మాములుగా లేడుగా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(FamilyStar ). ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేస్తూ..ప్రతి కుటుంబంలో ఒక హీరో ఉన్నాడు..ఈ ఫ్యామిలీ స్టార్ మీ అందరి కోసం వస్తున్నాడు. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ALSO READ : బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ.. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే

మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తోన్న విజయ్ దేవరకొండ లుక్, తెలంగాణ స్లాంగ్ లో వచ్చే డైలాగ్స్ టీజర్ కే అట్రాక్షన్ గా నిలిచాయి. ఉల్లిపాయలు కొంటె ఆడు మనిషి కాదా..పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా..అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.టీజర్ చివర్లో హీరోయిన్ మృణాల్ ఏవండీ అనే సింపుల్ డైలాగ్ తో టీజర్ కి పర్ఫెక్షన్ వచ్చింది. 

టీజర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన పరుశురాం..విజయ్ దేవరకొండ తో మరో హిట్ కొట్టడం కన్ఫర్మ్ అనేలా ఉంది. పరశురామ్, విజయ్ కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్(SVC54) పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో సీతరామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తుండగా..పరశురామ్(Parasuram) పెట్ల దర్శకతం వహిస్తున్నారు.